నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్.. వెయ్యిమంది విద్యార్థులకు పైగా అస్వస్థత.ఏలూరు - నూజివీడు ట్రిపుల్ ఐటీలో అపరిశుభ్ర వాతావరణం, నాసిరకం ఆహారంతో గత వారం నుంచి వందలమంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.విద్యార్థులు వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో అల్లాడిపోతున్నా యాజమాన్యం విషయం బయటకు రాకుండా దాచి పెట్టింది.వంట పాత్రలు, గ్రైండర్లు కడగకుండానే వాడుతున్నారని.. పులిసిపోయిన పిండి కలిపిన పెరుగు, చపాతీల్లో మైదా పిండి, నీళ్ల సాంబారు పెడుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు