వైసీపీ ఎంపీలు తమ పార్టీలో చేరే విషయమై తమకు సమాచారం లేదని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తెలిపారు. పార్టీ సిద్ధాంతాలకు వారు అంగీకరిస్తేనే చేర్చుకుంటామని చెప్పారు. వైసీపీ నుంచి వచ్చే ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యుల చేరికపైనా ఇదే విధానం పాటిస్తామని వివరించారు. దేశవ్యాప్తంగా బీజేపీకి 18 కోట్ల మంది సభ్యులుంటే.. ఏపీలో 35లక్షల మంది ఉన్నారని తెలిపారు.