శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. బుధవారం రాత్రి 6 గేట్ల ద్వారా నీటి విడుదల చేస్తున్న అధికారులు గురువారం ఉదయం మరో 4 గేట్లు ఎత్తారు. శ్రీశైలం నుండి కృష్ణమ్మ నాగార్జునసాగర్ వైపు పరుగులు పెడుతోంది. ఇన్ ఫ్లో 2,65,462క్యూసెక్కులు, జలాశయంలో పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు నీటినిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలుగా నమోదైంది.