ప్రజలను దృష్టి మరల్చేందుకు.. రాజ్యసభ సభ్యుల్ని పార్టీలోకి చేర్చుకోవాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని వైయస్ఆర్‌సీపీ నేతలు మండిపడుతున్నారు. ఏపీ తాజా రాజకీయ పరిణామాలపై తమ స్పందన తెలియజేస్తున్నారు. అధికారం లేదని పార్టీ మారినోళ్లు పరువు పోగొట్టుకున్నారని మాజీమంత్రి అంబటి రాంబాబు అన్నారు. రాజ్యసభ సభ్యుల పార్టీ మార్పుపై అంబటి రాంబాబు ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. అధికారం లేదని పార్టీ మారినోళ్ళు పరువు పోగొట్టుకున్నారు కానీ, ప్రజాదరణ పొందలేదు.. ఇది చారిత్రిక సత్యం! అని అన్నారు.