అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం బోదులూరు ఆశ్రమ బాలికల పాఠశాల నందు ఏ.ఎన్.ఎం. రామలక్ష్మి, వార్డెన్ మంగమ్మ తీవ్రంగా వేధిస్తున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థులకు తామర,గజ్జి ఉంది అనే నెపంతో విద్యార్థుల వస్త్రాలను విప్పించి ఇనుప గొట్టాలతో, బెత్తాలతో కొడుతున్నారంటూ, తమతో వెట్టి చాకిరి చేయించుకుంటున్నారని, తమ తల్లిదండ్రులను సైతం విమర్శిస్తూ మీరు కొండల్లో చేతబడి కలిగినటువంటి వారు, చదివి ఏం సాధిస్తారు అంటూ, పడుకునే సమయంలో వారి కాళ్లు నొక్కాలని, అంతేకాకుండా వారి నివాస గృహాల్లో అంట్లు తోమించుకోవడం బట్టలు ఉతికించుకోవడం వంటి చాకిరి చేయించుకుంటున్నారంటూ విద్యార్థులు తమ ఆవేదనను వెల్లబుచ్చుకున్నారు.మాకు ఈ ఏఎన్ఎం రామలక్ష్మి మరియు వార్డెన్ మంగమ్మ వద్దంటూ ప్రధాన ఉపాధ్యాయురాలు దృష్టికి తీసుకువెళ్లిన ఎటువంటి సమాధానం లేదని చెప్తున్నారు.