కర్నూలు జిల్లాలో పంట నమోదును వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టరు విష్ణుచరణ్ సూచించారు. రుద్రవరం మండలంలోని పంట పొలాలను గురువారం సాయంత్రం పరిశీలించి పంట నమోదు వివరాలను వీఏఏ సునీతను అడిగి తెలుసుకున్నారు. అలాగే సీసీఆర్‌సీ కార్డుల పంపిణీ ఎంత వరకు జరిగిందని అడిగారు. జిల్లాలో 3.23 లక్షల ఎకరాలకు గానూ ఇప్పటి వరకు 55 శాతం పంట నమోదు పూర్త యిందని చెప్పారు. సీసీఆర్‌సీ కార్డులు లక్ష్యం 27,700 కాగా ఇప్పటి వరకు 22500 కార్డులు పంపిణీ చే శారు. రైతుల విషయంలో నిర్లక్ష్యం చేయవద్దని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి మురళీ కృష్ణ, తహసీల్దారు మల్లికార్జునరావు, రైతులు పాల్గొన్నారు.