డిగ్రీ విద్యార్థులకు రిజర్వ్‌బ్యాంక్(ఆర్‌బీఐ) ఆన్‌లైన్ క్విజ్ పోటీలు నిర్వహిస్తుందని పార్వతీపురం, మన్యం జిల్లా, కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ తెలిపారు. ఆర్‌బీఐ స్థాపించి 90 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఆన్‌లైన్‌లో క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు సంబంధిత పోస్టర్‌ను గురువారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ కళాశాల విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చున్నారు. ఏ కళాశాల నుంచైనా విద్యార్థులు పాల్గొనవచ్చునన్నారు. జ్ట్టిఞట//ఠీఠీఠీ.టఛజీ90్ఞఠజ్డీ.జీుఽ వెబ్‌సైట్‌లో నమోదు కావాలని సూచించారు. విద్యార్థులు బృందంగా ఏర్పడి క్విజ్ పోటీల్లో నమోదు కావచ్చునన్నారు. బృందంలో కనీసం ఇద్దరు విద్యార్థుల ఉండాలన్నారు. పోటీలు స్టేట్‌రౌండ్, జోనల్ స్థాయి, జాతీయ స్థాయిలో మూడు స్థాయిల్లో జరుగుతాయన్నారు. జిల్లా లీడ్‌బ్యాంకు మేనేజర్ జేఎల్‌ఎన్ మూర్తి మాట్లాడుతూ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లను సెప్టెంబరు 17వ తేదీలోపు చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. దరఖాస్తు రిజిస్ట్రేషన్ కోసం ఎటువంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ఈ అవకాశాన్ని డిగ్రీ చదివే విద్యార్థులు వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ శోబిక, డీఆర్‌డీఏ పీడీ వై.సత్యంనాయుడు, జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి సాయికుమార్, జిల్లా పరిశ్రమల అధికారి ఎంవీ కరుణాకర్, పార్వతీపురం ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారి ఎ.మురళీధర్, నాబార్డు జిల్లా అభివృద్ధి అధికారి దినేష్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.