మార్కాపురం పట్టణంలోని చెరువును దాదాపు 500 ఎకరాలలో నిర్మిం చారు. ఆంగ్లేయులు చెరువును మరింత పటిష్ట పరుస్తూ, అలుగులు, తూములు నిర్మించారు. పట్టణంలోని రేడియో స్టేషన్ సమీపంలో పారిశ్రామికవాడ వద్ద చెరువు అలుగు పూర్తిస్థాయిలో ఆక్రమణలకు గురైంది. రేడియోస్టేషన్ సమీపంలో వెలసిన అక్రమ కట్టడాలు చిన్నమస్జీద్ వద్ద ఉన్న తూము వరకు విస్తరించాయి. 1976లో వచ్చిన తుఫాన్‌కు అలుగు పారి సమీపంలోని గృహా ల వద్ద నీరు చేరింది. దీంతో నీరు పారకుండా గోడకట్టి రాతి రివిట్‌మెంట్ వేశారు. కాలక్ర మేనా ఆక్రమణదారులు అలుగుకట్టను ఆక్రమించారు. తొలుత దిబ్బలు వేస్తూ, అనంతరం చుట్టూ రాళ్లు పేరుస్తారు. ఆపై రేకుల షెడ్లు నిర్మిస్తు మరికాస్త ముందుకు వెళ్లి ఇంకా కట్టడాలు నిర్మించారు. ఎటువంటి అనుమ తులు లేకపోయినా చెరువు అలుగు నుంచి చిన్నమసీద్ వరకు పక్కా కట్టడాలు వెలిశాయి. పట్టణ ప్రణాళిక విభా గం అధికారులు మాత్రం ఎటువంటి అనుమతులు లేని ఈ కట్టడాలను పట్టించుకోవడం లేదు. తమ ఆస్తులు కాపాడుకోవాల్సిన నీటి పారుదల శాఖ నిద్ర నటిస్తోంది. ఇదేవిధంగా పారిశ్రామకవాడ సమీపంలోని రెండో అలుగు వద్ద కూడా కట్టడాలు వెలిశాయి. చెరువు నిండినప్పుడు అధికమైన నీరు బయటకు పోయేందుకు ఏర్పా టు చేసిన ఈ అలుగులు ఆక్రమణలతో నిండి చిన్న మురు గు కాలువల మాదిరి మారి పోయాయి. విశాలమైన ఈ అలుగులను పక్కా కట్టడా లతో పాటు జీబ్ స్టాండ్‌ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. సాక్షాత్తు అలుగు గోడలపైనే నిర్మాణాలు సాగించారంటే రెండు శాఖల అధికారులు మాత్రం కళ్లు మూసుకుంటు న్నారు. రేడియో స్టేషన్ నుంచి తిరువీధుల బావి వరకు మార్కాపురం పట్టణం నుంచి వెళ్లే ప్రధాన రహదారిగా ఉండేది. అక్రమ కట్టడాలతో ఈ రహదారి కుంచించుకుపోయింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి అలుగుపై ఉన్న అక్రమ కట్టడాలు తొలగించాల్సి ఉంది.