విజయవాడలోని ఓ హోటల్లో ఉన్న ముంబై నటి జిత్వానీ నుంచి పోలీసులు స్టేట్మెంట్ను రికార్డు చేస్తున్నారు. ఇప్పటికే విచారణాధికారి స్రవంతి రాయ్ హోటల్‌కు చేరుకున్నారు. విచారణ సమయంలో నటి కన్నీళ్లు పెట్టుకున్నారు. జిందాల్‌పై అత్యాచారం కేసు నుంచి వరుసగా జరిగిన ఘటనలు వివరించినట్లు సమాచారం. విటిపియస్ గెస్ట్ హౌస్‌లో బంధించిన సమయంలో ఏయే పోలీసులు ఎలా ఇబ్బంది పెట్టారో చెప్పి నటి కన్నీటి పర్యంతమయ్యారు. రేప్ కేసు పెట్టిన డిసెంబరు 2023 నుంచి కేసు కొట్టేసిన మార్చి 2024 వరకు జరిగిన ఘటనలు పోలీసులకు జిత్వానీ వివరించారు. ఆమె చెప్పిన అంశాలను స్టేట్మెంట్ రూపంలో, వీడియో రూపంలో విచారణ అధికారులు తీసుకున్నారు. పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం జోడించి దర్యాప్తు చేస్తున్నారు.