బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లాలో శుక్రవారం రాత్రి వరకు ఓ మోస్తరు వర్షం కురిసింది. జిల్లాలో 38 మండలాలకు గాను 34 మండలాలలో 250. 4 మిల్లీ మీటర్లు, సరాసరి 6. 4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయింది. అత్యధికంగా హెచ్ఎం పాడు మండలంలో 26. 4 మిల్లీ మీటర్లు, అత్యల్పంగా అర్ధవీడులో 1 మిల్లీ మీటరు నమోదైనట్లు అధికారులు తెలిపారు.