అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలోని ధర్మసాగరం గ్రామంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు పెన్షన్లు పంపిణీ చేశారు. వర్షం పడుతున్నా ఆయా ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి అయ్యన్నపాత్రుడు పింఛన్లను శనివారం పంపిణీ చేశారు. ధర్మసాగరం గ్రామంలో సుమాల సత్యవతికి వితంతు పెన్షన్ అందజేశారు. ప్రభుత్వం ఒకరోజు ముందుగానే పెన్షన్లు అందజేయడం అభినందనీయమన్నారు.