ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక వెంబడి కెనెక్టివిటీని మరింత పెంచే మూడు వందే భారత్ రైళ్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారంనాడు ప్రారంభించారు. మీరట్ సిటీ-లక్నో, మధురై-బెంగళూరు, చెన్నై ఎగ్మోర్-నాగర్‌కోయిల్ మధ్య ప్రయాణించే ఈ కొత్త రైళ్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని ప్రారంభించినట్టు రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 'మేక్ ఇన్ ఇండియా', 'ఆత్మ నిర్భర్ భారత్' చర్యల్లో భాగంగా కొత్త రైళ్లతో మరింత వేగం, సౌకర్యవంతమైన ప్రయాణం సాకరమవుతుందని పేర్కొంది. 'మేక్ ఇన్ ఇండియా'లో భాగంగా వందే భారత్ రైళ్లను తొలిసారిగా 2019 ఫిబ్రవరి 15న ప్రవేశపెట్టారు. సౌకర్యవంతమైన ప్రయాణం, వేగవంతమైన ప్రయాణం కోసం తీసుకువచ్చిన వచ్చిన ఈ రైళ్లు ప్రస్తుతం 100కు పైగా రాకపోకలు సాగిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 280 జిల్లాలను కలుపుతూ ప్రయాణం సాగిస్తున్నాయి.