పాడయిన ఓ ప్రైవేటు హెలికాఫ్టర్‌ను ఎయిర్ ఫోర్స్ ఎమ్ఐ - 17 హెలికాఫ్టర్‌తో గగనమార్గంలో తరలిస్తుండగా శనివారం కూలిపోయింది. హెలికాఫ్టర్‌ను రిపేర్ల కోసం కేదార్నాథ్ నుంచి గౌచర్‌కు తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. అధిక బరువు, గాలుల తీవ్రత కారణంగా ఎమ్ఐ-17 మార్గమధ్యంలో ఉండగానే అదుపు తప్పే పరిస్థితి వచ్చిపడింది. దీంతో, పైలట్ మందుజాగ్రత్తగా పాడయిన హెలికాఫ్టర్‌ను నిర్మానుష్య ప్రదేశంలో జారవిడిచారు. ఈ మేరకు రుద్రప్రయాగ్ జిల్లా టూరిజం అధికారి రాహుల్ చౌబే ఓ ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.