ఆంధ్రప్రదేశ్‌లో రేషన్‌కార్డులు ఉన్నవారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వచ్చే నెల (సెప్టెంబర్) నుంచి బియ్యంతోపాటుగా పంచదార పంపిణీకి చర్యలు తీసుకుంది. జూన్‌లో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వంపౌరసరఫరాల శాఖ ప్రక్షాళనపై ఫోకస్ పెట్టింది. రేషన్ సరకుల సరఫరాలో అవకతవకలు జరిగాయని గుర్తించింది.. పంచదార ప్యాకెట్లలో తూకాల్లో తేడాలున్నట్లు తేలింది. పౌరసరఫరాల శాఖ మంత్రి మనోహర్ రాష్ట్రంలోని వివిధ పౌరసరఫరాల గోదాముల్లో తనిఖీలు చేశారు. పంచదార ప్యాకెట్లకు సంబంధించి తూకాల్లో తేడాలున్నట్లు గుర్తించారు.. అందుకే జులై, ఆగస్టు నెలల్లో కార్డుదారులకు పంచదార పంపిణీ ఆపేశారు. ఆ లోపాలను సరిచేసి, రేషన్ కార్డుదారులకు బియ్యంతోపాటు పంచదార సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంది.
అధికారులు ప్రస్తుతం సరైన తూకంతో పంచదార ప్యాకెట్లను సిద్ధం చేశారు. అంతేకాదు చక్కెర ప్యాకెట్ రంగు మార్చి.. ఇప్పటికే పౌరసరఫరాల గోడౌన్‌ల నుంచి రేషన్ షాపులకు బియ్యం, పంచదార సరఫరా చేస్తున్నారు. సెప్టెంబరులో బియ్యంతో పాటుగా పంచదార ఇచ్చేందుకు సన్నాహాలు చేశారు.. గోధుమపిండి, కందిపప్పు సరఫరా టెండర్ల దశలో ఉండటంతో.. ఆ ప్రక్రియ పూర్తైన తర్వాత అక్టోబరు నుంచి వాటిని పంపిణీ చేస్తామంటున్నారు పౌరసరఫరాలశాఖ అధికారులు. ఒక్కొక్క రేషన్ కార్డుకు పంచదార ప్యాకెట్ (అరకేజీ) చొప్పున రూ.17కు ఇస్తారు. అదే ఏఏవై (అంత్యోదయ అన్న యోజన) కార్డుకు కేజీ రూ.13కు అందిస్తారు.
మరోవైపు రాగుల్ని కొన్ని జిల్లాలకు మాత్రమే కేటాయించారు. వీటిని తీసుకునేందుకు లబ్ధిదారుల నుంచి వచ్చే డిమాండ్‌కు అనుగుణంగా ఇండెంట్ పెంచుతామంటున్నారు అధికారులు. కేజీ నుంచి మూడు కేజీల వరకు ఉచితంగా రేషన్‌లో రాగులు తీసుకోవచ్చని, రాగులు ఎన్ని కేజీలు తీసుకుంటే అన్ని కేజీలు బియ్యం తగ్గించి లబ్ధిదారులకు అందిస్తామని చెబుతున్నారు. అయితే కందిపప్పు, గోధుమ పిండిని అక్టోబర్ నెల నుంచి పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. కూటమి ప్రభుత్వం జులై నుంచి రేషన్ బియ్యంతో పాటుగా కందిపప్పు, చక్కెర, గోధుమ పిండిని పంపిణీ చేయాలని భావించింది. కానీ తూనికల్లో తేడాలు, ఇతర అవకతవకల కారణంగా రెండు నెలల పాటూ వీటి పంపిణీని నిలిపివేసింది.
ఈ రేషన్ వస్తువులకు సంబంధించిన లోటుపాట్లను సరిచేసి.. ముందుగా చక్కెరను బియ్యంతో పాటుగా పంపిణీకి సిద్ధమయ్యారు. అక్టోబర్ నెల నుంచి కందిపప్పు, గోధుమ పిండిని కూడా పంపిణీ చేస్తామంటున్నారు.. అంతేకాదు చిరుధాన్యాలను కూడా రేషన్ షాపుల్లో అందుబాటులోకి ఉంచుతామంటున్నారు. రైతుల నుంచే నేరుగా కొనుగోలు చేసి లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని చెబుతున్నారు. అంతేకాదు ఇటీవల కేబినెట్ సమావేశంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. రాష్ట్రవ్యాప్తంగా అదనంగా రేషన్ షాపుల్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.