ప్రముఖ బిలియనీర్ ఎలాన్ మస్క్ కు చెందిన సోషల్ మీడియా ప్లాట్ ఫాం 'ఎక్స్' సేవలపై బ్రెజిల్ సుప్రీంకోర్టు నిషేధం విధించింది. స్థానికంగా తమ దేశంలో కంపెనీ తరపున ఓ ప్రతినిధిని మస్క్ నియమించకపోవడంతో బ్రెజిల్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అలెగ్జాండర్ డి మోరేస్ ఈ ఆదేశాలు జారీచేశారు.
ఈ మేరకు ఎక్స్ పై బ్యాన్ విధించిన దేశాల జాబితాలో బ్రెజిల్ తో పాటు, చైనా, రష్యా, ఉత్తర కొరియా, ఇరాన్, మయన్మార్, పాకిస్తాన్, తుర్కెమెనిస్తాన్ దేశాలు ఉన్నాయి.