మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో వైయస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నెల్లూరు నగరంలోని కరెంట్ ఆఫీస్ సెంటర్ లో మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వై.యస్.రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పూలమాలవేసి, నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, కార్పొరేటర్లు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.