ఉమ్మడి అనంతపురం జిల్లాలో మహానేత వైయస్ఆర్ వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. వైయస్ఆర్సీపీ నాయకులు మహానేత విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సేవా కార్యక్రమాలు చేపట్టారు. వై.యస్ రాజశేఖర్ రెడ్డి గారి 15 వర్దంతిని పురష్కరించుకుని స్థానిక 2వ రోడ్డు లోని వై.యస్.ఆర్.సి. పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉమ్మడి అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, జలయజ్ఞం, ఫీజు రీంబర్స్మెంట్ ఇలా ఎన్నో పథకాలతో, బడి ఈడు పిల్లల నుండి పండు ముసలివారి వరకు సంక్షేమ సారధిగా పేదల ఎదుగుదలకు బాటలు వేసిన మహనీయుడు ఆ దివంగత నేత వై.యస్ రాజశేఖర్ రెడ్డి గారని, వారి భౌతికంగా మనకు దూరం ఉన్నా, వారి పథకాల ద్వారా లబ్ది పొందిన ప్రతి ఒక్కరి చిరునవ్వులో ఎప్పటికి కలకాలం నిలిచి ఉంటారని కొనియాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీమతి మంగమ్మ , అనంతపురము మాజీ శాసన సభ సభ్యులు అనంత వెంకట రామి రెడ్డి , నగర పాలక మేయరు, డిప్యూటి మేయర్లు, కార్పొరేటర్లు, వై.యస్.ఆర్.సి.పి సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.