చనిపోయి 15ఏళ్లు గడిచినా సరే ఆంధ్ర రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి గుండెల్లో చిరస్థాయిగా ముద్ర వేసిన మహానేత వైయస్‌ఆర్ అని వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. అయన మాట్లాడుతూ.... ప్రతి ఒక్కరికి చదువు, ఆరోగ్యం ముఖ్యమని ఆ దిశగా పరిపాలన సాగించారు. ఇంకా ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలని భావించి, ఆ సదుపాయం కూడా కల్పించారు. పేద పిల్లల చదువుల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్ తీసుకొచ్చారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరికి ఆరోగ్య భద్రత కల్పించిన ఒక గొప్ప ఉన్నతాశయం ఉన్న నాయకుడు. 2014–19 మధ్య కాలంలో వైయస్‌ఆర్ పాలనకు తూట్లు పొడస్తూ. ఆయన ప్రవేశపెట్టిన పథకాలను నీరుగారుస్తూ, ప్రజలను మోసం చేసేలా చంద్రబాబు పరిపాలన సాగింది. ఆ తర్వాత రాష్ట్రానికి సీఎం అయిన జగన్‌గారు వైయస్‌ఆర్ పథకాలను కొనసాగించారు. ప్రతీది గొప్పగా చేసి చూపారు. ఆరోగ్యశ్రీలో అనేక వ్యాధులను చేర్చి ప్రతి ఒక్కరికి వైద్యం అందించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 32 లక్షల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు అందించారు. 22 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టారు. వైయస్ఆర్‌సీపీ ఆశయాలు, ఆలోచన విధానం, జగన్ గారి విధానాలు అన్నీ వైయస్‌ఆర్ బాటలోనే నడుస్తున్నాయి అన్నారు.