పేద ప్రజల ఆశాజ్యోతి, బడుగు బలహీనవర్గాలకు అండగా, దేశ రాజకీయాల్లోనే తనకంటూ ఒక గొప్ప అధ్యాయాన్ని çసృష్టించుకున్న మహనీయుడు వైయస్ఆర్ అని మాజీ మంత్రి, మెరుగు నాగార్జున అన్నారు. అయన మాట్లాడుతూ.... రాజకీయాలు అంటే ఇలా ఉండాలి. ఏ రాజకీయ నాయకుడైనా ఇలా చేస్తే బాగుంటుంది, అని అందరు నాయకులకు ఆదర్శంగా నిలుస్తూ, ప్రజలను గుండెల్లో పెట్టుకుని పాలన సాగించిన మహనీయుడు వైయస్‌ఆర్. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కాలరాస్తే.. ఆయనను జ్ఞప్తికి తెచ్చుకునే వీలు లేకుండా చేయాలని చూస్తే.. వైయస్ జగన్ సీఎం అయ్యాక, తండ్రి ఆశయాలను పుణికి పుచ్చుకుని పరిపాలన సాగించారు. అలాంటి గొప్ప కార్యక్రమాలు అప్పుడు రాష్ట్రంలో జరిగితే, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం సంక్షేమాన్ని గాలికొదిలేసింది. అందుకే ప్రజల్లో ఆలోచన మొదలైంది. అతి తక్కువ వ్యవధిలోనే ప్రభుత్వం ప్రజల్లో విశ్వాసం కోల్పోయింది అని అన్నారు.