కర్నూలు, కొత్తపేటలోని టూటౌన్ పోలీస్‌స్టేషన్ సమీపంలో ఎస్పీ క్యాంపు కార్యాలయంలో సోమవారం ఎస్పీ జి.బిందు మాధవ్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 96 ఫిర్యాదులు వచ్చాయి.కర్నూలు సచివాలయంలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి కర్నూలు తాండ్రపాడుకు చెందిన మహేశ్వరరెడ్డి అనే వ్యక్తి రూ.5 లక్షలు తీసుకుని మోసం చేశాడని తుగ్గలి మండలం మారెల్ల గ్రామానికి చెందిన లక్ష్మన్న ఫిర్యాదు చేశారు.మధుబాబు అను వ్యక్తి తమ పొలాన్ని ఆన్‌లైన్ చేసి పాస్‌బుక్ ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేశాడని కోడుమూరు మండలం కొండపేటకు చెందిన కాశీంసాహేబ్ ఫిర్యాదు చేశారు.తన కుమారుడు ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, చర్యలు తీసుకోవాలని కర్నూలుకు చెందిన లక్ష్మీదేవి ఫిర్యాదు చేశారు.తమ అనుమతి లేకుండా, నోటీసు ఇవ్వకుండా పూర్వీకుల నుంచి ఉన్న పశువుల పాక రాతిగోడను ఎక్స్‌కవేటర్‌తో ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆస్పరి మండలం కారుమంచి గ్రామానికి చెందిన తిక్క నాగప్ప ఫిర్యాదు చేశారు.తమ 3 ఎకరాలలో సాగు చేసిన కంది పంటను గొర్రెలతో మేపీ పంట నష్టం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కర్నూలు స్టాంటన్‌పురానికి చెందిన ఆనంద్ కుమార్ ఫిర్యాదు చేశారు.లక్ష్మీపురం గ్రామ శివారులోని 2 ఎకరాల 76 సెంట్ల భూమిని సర్వేయర్ కొలిచి హద్దులు పాతితే.. పక్క పొలం వారు హద్దులు జరిపి గొడవలు సృష్టిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని డోన్‌కు చెందిన నవీన్ కుమార్ ఫిర్యాదు చేశారు.తన భర్త, అత్త కలిసి అదనపు కట్నం తీసుకురావాలని వేధిస్తున్నారని, వారితో పిల్లలకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కర్నూలు బుధవారపేటకు చెందిన పార్వతి ఫిర్యాదు చేశారు. విత్తనం వేసిన పొలాన్ని దౌర్జన్యంగా ట్రాక్టర్‌తో దున్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని సి. బెళగల్ చెందిన గోవిందమ్మ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, బాధితులు న్యాయం చేస్తామని ఎస్పీ జి. బిందుమాధవ్ హామీ ఇచ్చారు.