ద్వారకాతిరుమల చిన్న వెంకన్న ఆలయం నుంచి విజయవాడ వరద బాధితులకు ఐదువేల ఆహార పొట్లాలు తయారీ చేసి పంపించారు. వాహనాలను జండా ఊపి గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు విజయవాడకు పంపింంచారు. ప్రకృతి విపత్తు కారణంగా వరదలు సంభవించాయని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాత్రి, పగలు తేడా లేకుండా ప్రజల కోసం కష్టపడుతున్నారని చెప్పారు. ప్రకృతి విలయ తాండవానికి ప్రజలు ఆహారం కొరతతో ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఆపదలో ఉన్న సాటి మనిషికి సాయం చేయాలనే ఆలోచనతో దేవస్థానం తరఫున బాధితులకు ఆహార పొట్లాలు తయారీ చేయించి పంపుతున్నామని వివరించారు. మరో 10 వేల ఆహార పొట్లాలు తయారు చేసి బాధితులకు అందజేస్తామని మద్దిపాటి వెంకటరాజు వెల్లడించారు.