వరద సహాయక చర్యలపై కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మంత్రి లోకేష్ నిరంతరం సమీక్ష నిర్వహిస్తున్నారు. వరద ముంపు ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరద ముంపునకు గురైన సింగ్ నగర్, జక్కంపూడి, కండ్రిగ, అజిత్ సింగ్ నగర్, డాబా కొట్ల సెంటర్, లూనా సెంటర్ ప్రాంతాల్లోని అపార్ట్‌మెంట్‌పై అంతస్థుల్లో నివసిస్తున్న వారికి డ్రోన్ల ద్వారా ఆహార పొట్లాలు పంపిణీ చేస్తున్నారు. 6 హెలీకాప్టర్ల ద్వారా పులిహోర, బిస్కెట్లు, మందులు, వాటర్ బాటిళ్లు, సాఫ్ట్ డ్రింక్స్ ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు పంపిణీ చేస్తున్నారు. టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070 లకు వస్తున్న విన్నపాలపై ఎప్పటికప్పుడు స్పందించేలా ఏర్పాట్లు చేశారు. ఐవిఆర్ఎస్ ద్వారా వరద బాధిత ప్రాంతాల ప్రజల నుంచి సహాయ చర్యలను అధికార యంత్రాంగం వాకబు చేస్తోంది. వరద ముంపు ప్రాంతాల్లో 3.9లక్షల ఆహార పొట్లాలు పంపిణీ చేయాలని అధికారులకు నిర్దేశించారు.