విజయవాడ పరిసర ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకున్న బాధితుల కోసం సింహాచలం సింహాద్రి అప్పన్న ఆలయం నుంచి మొత్తం 30 వేల పులిహోర ప్యాకెట్లను పంపించినట్లు ఆలయ ఈవో శ్రీనివాస మూర్తి తెలిపారు.
విశాఖ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ఆదేశాల మేరకు రెండవ తేదీన పదివేల ప్యాకెట్లు, మూడవ తేదీ మంగళవారం ఉదయం పదివేలు ప్యాకెట్లు, మధ్యాహ్నం మరో పదివేల ప్యాకెట్లను పంపించినట్లు పేర్కొన్నారు.