దేశంలోని అతిపెద్ద చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్గా 'సతీష్ కుమార్ వడుగిరి' సెప్టెంబర్ 2న బాధ్యతలు చేపట్టారు. ఇటీవల రాజీనామా చేసిన ఎస్ఎం వైద్య స్థానంలో సతీష్ నియామకమైనట్లు అధికారిక ప్రకటన వెలువడింది.
2021 అక్టోబరు నుంచి డైరెక్టర్ (మార్కెటింగ్)గా పనిచేస్తున్న ఆయన తన ప్రస్తుత పాత్రను కొనసాగిస్తూనే చైర్మన్గా అదనపు బాధ్యతలను నిర్వహిస్తారు. ఆయన 2022 అక్టోబర్ నుంచి ఏడాది పాటు డైరెక్టర్ (ఫైనాన్స్)గా కూడా పనిచేశారు.