ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలికలని వేధింపులకు గురిచేస్తున్న ప్రిన్స్‌పాల్ భర్త, కేసు నమోదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 03, 2024, 07:58 PM

అన్నమయ్య జిల్లాలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. లక్కిరెడ్డిపల్లె అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్ భర్త వేధింపులకు విద్యార్థినిలు వణికిపోతున్న పరిస్థితి. ఐదవతరగతి బాలికపై ప్రిన్స్‌పాల్ భర్త లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. పాఠశాల ఆవరణలోనే క్వార్టర్స్‌లో ప్రిన్సిపల్ పరిమిళ కుటుంబం నివాసం ఉంటోంది. ఈ క్రమంలో ప్రిన్స్ పాల్ భర్త బాల సుబ్బయ్య.. ఐదవ తరగతి బాలికను దగ్గరకు పిలిచి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయంపై ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసిన బాలికలు ఆపై ఆందోళనలకు దిగారు. మొదట బయట ఎవరికి చెప్ప వద్దని బాలికలను ప్రిన్సిపల్ బెదిరింపులకు పాల్పడినట్లు విద్యార్థినిలు చెబుతున్నారు. విషయం తెలిసిన వెంటనే మంత్రి రాంప్రసాద్ రెడ్డి, కలెక్టర్ పాఠశాలను సందర్శించారు. ప్రిన్స్‌పాల్, ఆమె భర్త ఇరువురిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీసులను కలెక్టర్ ఆదేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com