నిడుగల్ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతానని ఎంపీ గోవింద కారజోళ పేర్కొన్నారు. శ్రావణ మాస చివరి సోమవారం సందర్భంగా నిడుగల్ ఉత్సవాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. నిడుగల్ ప్రాంతంలోని పరిసరాలు, దేవాలయాలు, పురాతన విగ్రహాలు కనువిందు చేస్తున్నాయ న్నారు. మలే నాడును తలపించేలా ఉన్నాయన్నారు. వాల్మీకి సంజయ్ కుమార్ స్వామీజీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిడుగల్ ఉత్సవాలు ప్రభుత్వం తరుపున జరిపించేందుకు తన వంతు కృషిచేస్తానని తెలిపారు. నిడుగల్ ఉత్సవాలను ప్రభుత్వం తరుపున జరిపించేందుకు ముఖ్యమంత్రితో చర్చిస్తానని ఎమ్మెల్యే వెంకటేశ తెలిపారు.