అనంతపురం జిల్లా, బొమ్మనహళ్మండల పరిధిలోని దర్గాహోన్నూరులో విషజ్వరాలు విజృంభించాయి. ఇద్దరు విద్యార్థులు, ఒక వృద్ధురాలు ఆస్పత్రి పాలయ్యారు. విద్యార్థిని వైష్ణవి (14) పరిస్థితి విషమించడంతో బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పాల్తూరుకు చెందిన వెంకటలక్ష్మి అనే వృద్ధురాలు బళ్లారిలో చికిత్స పొందుతున్నారు. ఏడేళ్ల లక్ష్మి అనే విద్యార్థిని ఉరవకొండ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ప్రజలు రోగాల బారిన పడుతున్నా వైద్యులు అందుబాటులో ఉండటం లేదని స్థానికులు వాపోతున్నారు.