విజయవాడ వరద బాధితులకు సీఎం చంద్రబాబు సాయం ప్రకటించారు. ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం, లీటర్ పామాయిల్, రెండు కేజీల ఉల్లిపాయలు, రెండు కేజీల బంగాళదుంపలు, కేజీ చక్కెర అందించాలని ఆదేశించారు. విద్యుత్ పునర్ధురణ, శానిటేషన్ పనులు వేగవంతం చేయాలని అధికారులకు చెప్పారు. ప్రతి సచివాలయంలో ఒక మెడికల్ క్యాంప్ పెట్టి వైద్య సేవలు అందించాలని తెలిపారు.