కందుకూరు సబ్ కలెక్టర్ గా తిరుమణి పూజ బుధవారం బాధ్యతలు చేపట్టారు. 2022 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన తిరుమణి పూజని ఇక్కడ సబ్ కలెక్టర్ గా నియమిస్తూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సివిల్స్ 62వ ర్యాంకు సాధించిన ఆమె ఆంధ్రా క్యాడర్ కి నియమితులయ్యారు. ప్రొబేషనరీ పీరియడ్ పూర్తయిన వెంటనే తొలి పోస్టింగ్ గా ఆమెను కందుకూరు సబ్ కలెక్టర్ గా నియమించారు.