వరద బాధితుల సహాయార్థం సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ విరాళం అందించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెరో 10 లక్షల రూపాయలు చెక్‌లను రెండు రాష్ట్రాల రెసిడెంట్ కమిషనర్లకు జస్టిస్ ఎన్వీ రమణ అందించారు. వరద సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న రెండు రాష్ట్రాల సీఎంలను జస్టిస్ ఎన్వీ రమణ అభినందించారు. ఏపీ అడిషనల్ రెసిడెంట్ కమిషనర్ హిమాన్షు కౌశిక్, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్‌కు జస్టిస్ ఎన్వీ రమణ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ మీడియాతో మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఉదారంగా సహాయాన్ని అందించాలన్నారు.