రెండు తెలుగు రాష్ట్రాలు వరద కారణంగా తీవ్రంగా నష్టపోయాయి. ఏపీలోని పలు జిల్లాలు, తెలంగాణలోని పలు జిల్లాలు వరద ఉధృతికి తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రజానీకానికి నిలువ నీడ కూడా లేకుండా పోయింది. వరద నష్టం అంచనాలకు అందడం లేదు. ఈ తరుణంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రజలకు సాయమందించేందుకు శ్రమిస్తున్నా సరిపడా వనరులు లేక ఇబ్బంది పడుతున్నాయి. ఈ తరుణంలోనే విరాళాలను అర్థిస్తున్నాయి. దీనికి సినీ, రాజకీయ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి మంచి స్పందన వస్తోంది. తమ వంతు సాయంగా రెండు తెలుగు రాష్ట్రాలకు విరాళాలను ప్రకటిస్తున్నారు. ఇవాళ ఉదయం సినీనటుడు చిరంజీవి రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో రూ.50 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.