టీడీపీ కేంద్ర కార్యాలయం, చంద్రబాబు నివాసంపై జరిగిన దాడి కేసుల్లో వైసీపీ నేతలకు బిగ్ షాక్ తగిలింది. ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ నేతలకు నిరాశే ఎదురైంది. వైసీపీ నేతలకు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఈరోజు (బుధవారం) హైకోర్టులో విచారణకు రాగా.. బెయిల్ ఇచ్చేందుకు ధర్మాసనం తిరస్కరించింది.హైకోర్ట్ ఉత్తర్వులను రెండు వారాల పాటు సస్పెండ్ చేసి తమకు సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు అవకాశం ఇవ్వాలని వైసీపీ నేతల తరపు న్యాయవాదులు కోరారు. ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు ఉందని వైసీపీ నేతల తరపు న్యాయవాదులు చెప్పారు. అయితే సుప్రీంకోర్టు తీర్పు అలా లేదని కోర్టుకు టీడీపీ న్యాయవాదులు తీర్పు కాపీ ఇచ్చారు. అన్నింటినీ పరిశీలించిన హైకోర్టు తుది ఉత్తర్వులు ఈరోజు మధ్యాహ్నం ఇస్తామని పేర్కొంది.