రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడుల నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి డిమాండ్ చేశారు. బుధవారం అనంతపురం కేఎ్‌సఎన ప్రభుత్వ బాలికల డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో ఐద్వా ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడారు. దేశంలో మహిళలపై రోజురోజుకీ హత్యాచారాలు, దాడులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని అరికట్టాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంఘటన జరిగినప్పుడు హడావిడి చేయడం తప్ప శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టడంలో అలసత్వం వహిస్తున్నాయని విమర్శించారు. కోల్‌కతాలో వైద్య విద్యార్థిని పట్ల జరిగిన దారున ఘటన దేశాన్ని కుదిపేసిందన్నారు. కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర కోశాధికారి సావిత్రి, ఉమెన కోఆర్డినేషన కమిటీ సభ్యురాలు బృంద, విశ్రాంత ప్రిన్సిపాల్ డాక్టర్ శశికళ, డాక్టర్ ప్రసూన, అధ్యాపకులు రాజగోపాల్, అరుణ, మహిళా సంఘం నాయకురాలు కుమారి, శ్యామల, చంద్రిక, ఓతూరు పరమేష్ పాల్గొన్నారు.