ప్రపంచానికి అన్నంపెట్టే రైతులను మనం కాపాడుకోవాలని, లేనిపక్షంలో ప్రపంచీకరణకు భవిష్యత్తు లేకుండా పోతుందని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్నారు. ఆయన బుధవారం సేద్యం చిత్రం పోస్టర్లను మడకశిర పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు పడు తున్న బాధలు, సేద్యం కోసం పడే కష్టాలను ప్రతి బింబించే విధంగా సేద్యం సినిమా తీయడం అభినందనీయ విషయం అన్నారు. గుడిలో దేవుడిని పూజి స్తాం... వారు పెట్టే ప్రసాదాన్ని స్వీకరించి రెండు చేతులెత్తి మొక్కుతామని, అసలైన దైవం రైతే అన్నారు. రైతు పండించే పంట ప్రపంచానికే ప్రసాదం లాంటిదన్నారు. రైతును గుర్తించి రైతులపై జరుగుతున్న అన్యాయాలను అరికట్టడానికి డైరెక్టర్ చంద్రకాంత పసుపులేటి సినిమా చిత్రీకరించడం సంతోషించదగ్గ విషయం అన్నారు. ఈనెల 6న సినిమా విడుదలవుతున్నట్లు తెలిపారు. ఈసందర్భంగా అసోసియేషన డైరెక్టర్ హరి, నటులు పసుపులేటి శ్రీనివాసులు, బాబా కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.