వరద భీభత్సంతో అతలాకుతలమైన విజయవాడ వాసులను ఆదుకోవడం ప్రతిఒక్కరి కర్తవ్యమని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి వారికి అవసరమైన ఆహారం మంచినీరు అందించాలని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. విజయవాడ వరద బాధితుల కోసం 10వేల మందికి సరిపడా ఆహార పదార్థాలు తరలిస్తున్న వ్యాన్లను అనపర్తి దేవీచౌక్ వద్ద ఆయన జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు. అనపర్తి మండలం పొలమూరుకు చెందిన బుద్దవరపు చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఐదు వేల మందికి సరిపడా ఆహార పదార్థాలు, బిక్కవోలు మండలం బలభద్రపురంలోని వేంకటేశ్వరస్వామి ఆలయకమిటీ ఆద్వర్యంలో 2500 మందికి ఆహార పదార్దాలు, అనపర్తి వర్తక సంఘం అధ్యక్షుడు కొవ్వూరి వెంకటరా మారెడ్డి ఆధ్వర్యంలో 2500మందికి ఆహార పదార్థాలను తరలించారు. ఈ సందర్బంగా విజయవాడ పయనమైన వాహనాలకు ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కొవ్వూరి శ్రీనివాసరెడ్డి, సత్తి దేవదానరెడ్డి, మల్లిడి శ్రీనివాసరెడ్డి, గొలుగూరి భాస్కరరెడ్డి, కొవ్వూరి పార్వతి తదితరులు పాల్గొన్నారు.