పశ్చిమ గోదావరి జిల్లా, కలిదిండి మండలంలోని తాడినాడ గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కొత్తపల్లి బంగా ర్రాజు బుధవారం విజయవాడ కలెక్టరేట్లో సీఎం చంద్రబాబును కలసి వరద బాధితుల కోసం లక్ష రూపాయల చెక్కును విరాళంగా అందించారు. వరద బాధితులకు సాయమందించటానికి దాతలు ముందుకు రావటం అభినందనీయమని మానవతా దృక్పథంతో బాధితులను ఆదుకోవాలని సీఎం సూచించారని తెలిపారు. టీడీపీ నాయకుడు సొర్రా అరవింద్ తదితరులు పాల్గొన్నారు.