పౌష్టికాహారం తినడంవల్ల రక్తహీనత దరిచేరదని గర్భిణు లు, బాలింతలకు సీడీపీఓ శాంతలక్ష్మి సూచించారు. పెనుకొండ పట్టణంలోని ఎగువగడ్డ అంగనవాడీ కేంద్రంలో బుధవారం పౌష్టికాహార వారోత్సవాలు నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన సీడీపీఓ మాట్లాడుతూ అంగనవాడీ కేంద్రంలో ఇచ్చే పౌష్టికాహారాన్ని తింటే చిన్నారులకు మంచిదన్నారు. అనంత రం ఇద్దరు చిన్నారులకు అన్న ప్రాసన, ఇద్దరు గర్భిణులకు సీమంతాలు నిర్వహించారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్‌లు పుష్ప, శ్యామల, అంగనవాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.