ఏపీలో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం రాసలీలల వీడియోలు వైరల్ కావడంతో టీడీపీ హైకమాండ్ స్పందించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు దృష్టికి పార్టీ పెద్దలు ఈ విషయాన్ని తీసుకెళ్లారు.
ఎమ్మెల్యే ఆదిమూలంపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఈ అంశంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. తప్పు జరినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.