ఇటీవల కురిసిన భారీ వర్షాలతో విజయవాడ నగరం జలమయమైంది. ఈ క్రమంలో సింగనగర్ లో డెయిరీ ఫాం నిర్వహించే చంద్రశేఖర్ అనే యువకుడు ప్రాణాలకు తెగించి వరదలో చిక్కుకున్న 50 ఆవులతో పాటు నలుగురు వ్యక్తులను కాపాడాడు.
ఈ క్రమంలోనే కాలుజారడంతో చంద్రశేఖర్ వరదలో కొట్టుకుపోయి మృతి చెందాడు. కాపాడపడ్డ వారిలో తన ఇద్దరు సోదరులతో పాటు మరో ఇద్దరు ఉన్నారు. చంద్రశేఖర్ మృతదేహం ఘటనాస్థలానికి 500 మీటర్ల దూరంలో దొరికింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa