ప్రముఖ శైవ క్షేతం శ్రీశైలం. ఆ శ్రీశైలంలో కొలువు తీరిన శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు శనివారం నుంచి.. అంటే సెప్టెంబర్ 07వ తేదీన నుంచి ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఈ మహోత్సవాల్లో భాగంగా.. లోక కళ్యాణార్థం ఈ నెల 7వ తేదీ నుంచి 16వ తేదీ వరకు రత్నగర్భ గణపతికి, సాక్షి గణపతికి యాగశాలలోని పంచలోహమూర్తికి వ్రత కల్ప విశేషార్చనలు చేయనున్నారు. సాక్షి గణపతి వద్ద మృత్తికా గణపతి విగ్రహాన్ని నెలకొల్పి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ధర్మ ప్రచారంలో భాగంగా సెప్టెంబర్ 7వ తేదీన నిర్వహిస్తున్న ఈ పూజల్లో తెల్లరేషన్ కార్డు కలిగిన వారికి ఉచితంగా పూజలు నిర్వహిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. అందుకోసం ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని భక్తులకు అధికారులు సూచించారు. ఈ గణపతి నవరాత్రి మహోత్సవాలు సెప్టెంబర్ 16వ తేదీతో ముగియనున్నాయి.