విజయవాడ పరిధిలో వరధ ప్రభావంతో తీరని నష్టం వాటిల్లిందని ఇది బాధాకరమని చీరాల మునిసిపల్ కమిషనర్ చక్రవర్తి పేర్కొన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పురపాలక కార్యాలయ పరిధిలోని అధికారులు, సిబ్బంది కమిషనర్ ఆధ్వర్యంలో సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఈసందర్భంగా పారిశుధ్య కార్మికుల సహకారంతో విజయవాడలోని మైత్రీనగర్ 5వ వార్డులో చెత్తను తొలగించడం, మురుగు నిల్వలను తరలించడం వంటివి నిర్వహించారు. ప్రతి ఒక్కరూ మానవత్వంతో ముందుకొచ్చి సహాయక కార్యక్రమాలను నిర్వహించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. ఆయనవెంట శానిటరీ ఇన్‌స్పెక్టర్‌లు, హెల్త్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.