విజయవాడ నగరంలో గురువారం పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు 15వేల లీటర్ల పాల ప్యాకెట్లను వరద ముంపు బాధితులకు అందజేశారు. భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన విజయవాడ ప్రాంతంలో మూడవరోజు గురువారం కూడా ఏలూరి ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ కార్యక్రమం కొనసాగింది. మరోపక్క ఏలూరి పిలుపు మేరకు నియోజకవర్గానికి చెందిన ఎన్నారైలు, దాతలు ఆహారం, వస్త్రాలు, మంచినీటి బాటిళ్లను పెద్ద ఎత్తున బాధితులకు తరలించారు.