ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నంలో వరదల కారణంగా విధి నిర్వహణలో మృతి చెందిన లైన్ మెన్ కోటేశ్వరావు కుటుంబానికి రూ. 32 లక్షల ఎక్స్ గ్రేషియాను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది బాధితుడి భార్యకు ఉద్యోగం, పిల్లలకు డిగ్రీ పట్టభద్రులు అయ్యేంతవరకు సంవత్సరానికి ఒక్కొక్కరికిరూ. 25 వేల రూపాయలు ఆర్థిక సాయం ప్రభుత్వం ప్రకటించింది. ఎక్స్గ్రేషియా చెక్కును, ప్రభుత్వ నియామక పత్రాన్ని , పిల్లల చదువుకు సంబంధించిన ఆర్థిక సహాయా ఉత్తర్వులను బాధ్యత కుటుంబానికి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అందజేశారు.