బాబు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు పడవలపై తిరుగుతూ షో చేస్తున్నాడు. వరదలు సంభవిస్తే డిప్యూటీ సీఎం పవన్ ఎందుకు స్పందించలేదు? అని మాజీమంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. వైఎస్ జగన్ విజయవాడ వచ్చాక పవన్ మేల్కొన్నారు. చంద్రబాబు ఇల్లు మునిగాక మీకు వరదలు గుర్తొచ్చాయి. పవన్ విజయవాడుకు రాకపోవడం తప్పు కాదు.. స్పందించకపోవడం తప్పు. బుడమేరు అంతా ఆక్రమించారని పవన్ అంటున్నారు. వారి కట్టడాలపై చర్చించాలన్నారు. పవన్‌కు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. చంద్రబాబు బఫర్ జోన్లో ఉన్నారు. ముందు చంద్రబాబును కూర్చోబెట్టి మాట్లాడు పవన్. కరకట్ట ఇంట్లో నుంచి బాబును ఖాళీ చేపించు. బఫర్ జోన్లో ఉన్న చంద్రబాబు నివాసాన్ని స్టే నుంచి తప్పించి.. కూల్చివేసి పవన్ శభాష్ అనుకోవాలని కోరుతున్నాను’ అంటూ కామెంట్స్ చేశారు.