వరద బాధితులను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గురువారం ప్రకటనలో పిలుపునిచ్చారు. నాలుగు రోజులుగా కోటి రూపాయలు తన సొంత నిధులతో వరద బాధితులకు ఆహార ప్యాకెట్‌లు, వాటర్‌బాటిల్స్, 90వేల పాలప్యాకెట్‌లను అద్దంకి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు విజయవాడలోనే ఉండి పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రధానంగా విజయవాడ లోని సింగ్‌నగర్, రాజేశ్వరినగర్‌తో పాటు బాపట్ల జిల్లాలోని పునరావాస కేంద్రాలలోని బాధితులకు కూడా అందజేశారు. గురువారం విజయవాడలోని గొల్లపూడి, సింగ్‌నగర్, వైఎస్సార్ కాలనీలలోని బాధితులకు స్థానిక టీడీపీ నేతలు పాలప్యాకెట్‌లు, వాటర్ బాటిళ్లను పంపిణీ చేశారు. టీడీపీ నేతలు కరి పరమేష్, సందిరెడ్డి శ్రీనివాసరావు, చాగంటి రాజేంద్ర ప్రసాద్, తేలప్రోలు రమేష్, మహేష్, వీరయ్య, వెంకటసుబ్బారావు ఆధ్వర్యంలో పంపిణీ సాగుతోంది.