చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై పట్టపగలు ఎర్రచందనం స్మగ్లర్లను టాస్క్‌ఫోర్స్ పోలీసులు వెంటాడి పట్టుకున్నారు. చెన్నై నుంచి ఎర్రచందనం అక్రమంగా రవాణా జరుగుతుందన్న సమాచారం చిత్తూరు జిల్లా టాస్క్‌ఫోర్స్ అధికారులకు అందింది.సీఐ సురే్‌షకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ఓ బృందం జాతీయ రహదారిపై నిఘాపెట్టింది.గురువారం మధ్యాహ్నం సమయంలో చెన్నై నుంచి తడ వైపు ఓ వేగనార్ కారు ముందు వెళ్తుండగా దాని వెనుకనే ఒక ఐసర్ కంటైనర్ లారీ వెళ్తుండటాన్ని గుర్తించి టాస్క్‌ఫోర్స్ పోలీసులు వెంట పడ్డారు.వేగంగా వెళ్తున్న లారీని, కారును తడ మండలం బోడిలింగాలపాడు మలుపు దాటిన తరువాత టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ముందుగా కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు.లారీలోని డ్రైవర్‌ను, క్లీనర్‌ను అదుపులోకి తీసుకొని తనిఖీ చేశారు. కంటైనర్ లారీలో ముందుపక్క అట్ట బాక్స్‌లు వెనుక ఎర్రచందనం దుంగలు ఉండటం గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీసులకు, రెవెన్యూ సిబ్బందికి సమాచారం ఇచ్చి అప్పటికప్పడు అక్కడికక్కడే పంచనామా నిర్వహించారు. సుమారు 140 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకొని నిమిషాల వ్యవధిలోనే అక్కడ నుంచి ఆ వాహనాలను, స్మగ్లర్లను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అక్కడ నుంచి తరలించుకువెళ్లారు. దీనిపై సీఐ సురే్‌షకుమార్‌రెడ్డిని వివరాల కోసం ప్రశ్నించగా ఆయన వివరాలు తెలిపేందుకు నిరాకరించారు.