మన్యం జిల్లాలోని కొండ శిఖర గ్రామాల్లో ప్రతి ఒక్కరికీ వైద్యం అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం గిరి వైద్య కేంద్రాల పేరిట కంటైనర్ క్లినిక్‌ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఐదు చోట్ల ఈ క్లినిక్‌లను ఏర్పాటు చేయనుంది. తొలుత సాలూరు మండలం తోనాం పీహెచ్‌సీ పరిధిలోని కారాడవలస గ్రామంలో కంటైనర్ క్లినిక్ సేవలను ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే ట్రాలీ లారీలో కంటైనర్‌ను కారాడవలసకు తీసుకువచ్చారు. దీన్ని ఏర్పాటు చేసే ప్రాంతాన్ని ఎక్స్‌కవేటర్‌తో చదును చేయించారు. అనంతరం కంటెనర్‌ను కిందకు దించారు. ఈ కంటైనర్‌లో రోగుల కోసం నాలుగు బెడ్లు ఏర్పాటు చేయనున్నారు. డాక్టర్‌తో పాటు వైద్య సిబ్బంది ఉంటారు. ఓపీ సేవలు కూడా అందించనున్నారు. అందులో ఒక టీవీని కూడా ఏర్పాటు చేయనున్నారు. రోగులతో వచ్చే సహాయకుల కోసం ప్రత్యేక వెయిటింగ్ రూమ్ కూడా ఉండనుంది. కంటైనర్ ప్రాంగణంలో అంగన్వాడీ కేంద్రంతో పాటు మహిళా సంఘాల సమావేశాలు నిర్వహించుకొనేందుకు అవసరమైన సల్థం ఉంటుంది. దీనిని కూడా ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు ఉపయోగించుకోవచ్చు.