సామాజిక పింఛన్ లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పింఛన్ తీసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. కొత్త ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పింఛన్ బదిలీకి అవకాశమిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. నేడు ఆచరణలో పెట్టారు. ఇకపై లబ్ధిదారులు రాష్ట్రంలో ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ పింఛన్ తీసుకోవచ్చు. పింఛన్ బదిలీ చేయాలనుకుంటున్న వారు ఎక్కడ పింఛన్ తీసుకుంటున్నారో ఆ సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేయడం ద్వారా తాత్కాలికంగా బదిలీ చేసుకోవచ్చు. దరఖాస్తులో పింఛన్ ఐడీ, ఏ ప్రాంతంలో తీసుకోవాలని అనుకుంటున్నారో ఆ జిల్లా, మండలం, ప్రాంతం పేరు పేర్కొనాలి. ఆధార్ జిరాక్స్ ఇవ్వాలి. సామాజిక పింఛన్ వెబ్‌సైట్‌లో ప్రస్తుతం ఆ ఆప్షన్ ఓపెన్ అయ్యింది. స్వగ్రామాలకు రాలేనటువంటి వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ ప్రతినెలా అందుబాటులో ఉంటుందని అధికారులు చెబుతున్నారు. చాలా మంది లబ్ధిదారులు వివిధ కారణాలతో గ్రామాలకు దూరంగా ఉంటున్నారు. పింఛన్ అందుకోవడానికి వ్యయప్రయాసలు పడుతున్నారు. అటువంటి వారి కోసం ప్రభుత్వం పింఛన్ తాత్కాలిక బదిలీకి వెసులుబాటు ఇచ్చింది.