నాగావళి నదిలో పొన్నాడ వద్ద అదే గ్రామానికి చెందిన అంపోలు అప్పారావు బుధవారం గల్లంతై.. గురువారం శ్రీకాకుళం రూరల్ మండలం పెద గనగళ్లవానిపేట వద్ద సముద్రతీరంలో శవమై కనిపించాడు. ఈయన వృత్తిలో భాగంగా బట్టలు ఉతికేందుకు వెళ్లి బండరాయి చుట్టూ ఉన్న ఇసుక మేటలు తొలగించి బయటకు తీసే క్రమంలో గల్లంతయ్యాడు. కాగా అప్పారావు మృతదేహాన్ని శ్రీకాకు ళం సర్వజనాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి, కుటుంబ సభ్యులకు అప్పగిం చారు. శ్రీకాకుళం రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.