ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి దగ్గర బుడమేరుకు పడిన గండ్ల పూడిక పనుల్లో కీలక ఘట్టానికి చేరుకున్నారు. విజయవాడ సింగ్నగర్ను ముంపుకు కారణమైన మూడు గండ్లలో రెండు గండ్లు పూడ్చి కీలకమైన మూడో గండికి చేరుకునేలా యుద్ధ ప్రాతిపాదికన పనులు సాగుతున్నాయి. గత ఐదు రోజుల నుంచి మంత్రి నిమ్మల రామానాయుడు.. అక్కడే ఉండి ఏజెన్సీలతో పనులు చేయిస్తూ ఎప్పటికప్పుడు వర్క్ ప్రోగ్రెస్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లకు అప్డేట్ చేస్తున్నారు. బుడమేరు మూడో గండిని అధికార యంత్రాంగం పూడుస్తోంది. అక్కడే ఉండి పనులను పర్యవేక్షిస్తున్న మంత్రి నిమ్మల రామానాయుడు మూడో గండి కూడా పూడ్చే వరకు అక్కడ నుంచి వెళ్ళే ప్రసక్తి లేదని చెబుతున్నారు. మూడో గండిని ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు సాయంత్రానికల్లా పూర్తి చేయాలని దృఢ సంకల్పంతో రామానాయుడు పనులు చేయిస్తున్నారు. గండి పడిన ప్రాంతానికి ఆర్మీ చేరుకుంది. ఆర్మీ అధికారులు సహాయ సహకారాలతో పనుల్లో వేగం పెంచారు.